Governor Jishnu Dev Varma | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని సమాచారం. ఆమోదానికి వెళ్లిన ఫైలుపై గవర్నర్ పలు కొర్రీలు వేసినట్టు తెలుస్తున్నది. హైడ్రా ఏర్పాటు, పరిధి, విధివిధానాలకు సంబంధించి న్యాయపరమైన పలు అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం.
సెప్టెంబర్ 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌కు అధికారులు వివరించారు. అయితే, గవర్నర్ పలు అనుమానాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది.