కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బాలిక (16) పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి మాయమాటలతో లోబర్చుకొని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని తెలిపారు.
విషయం తెలియడంతో బాలిక తండ్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కిరణ్ జిల్లా కలెక్టరేట్లో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.