మహబూబ్ నగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం నుంచి ప్రస్తుతం సుంకేసుల డ్యాంకు 16,587 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. వరదను నాలుగు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 16000వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు డ్యామ్ ఈ ఈ రాజు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.