హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వరద ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణం. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాలకు 85వేల క్యూసెక్కులు వరద వస్తుండగా, దిగువకు 62 వేల క్యూసెక్కులు వెళ్తున్నది. ఆ వరద శ్రీశైలంలోకి చేరుతున్నది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. ఇక మరోవైపు గోదావరి పూర్తిగా వరద ప్రవాహాలు తగ్గుముఖం పట్టగా, ప్రాణహితలో లక్ష క్యూసెక్కుల వరద స్థిరంగా కొనసాగుతున్నది.