పెద్దకొత్తపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి చెరువులో నాణ్యతలేని చేప పిల్లలను వదిలిపెట్టేందుకు ప్రయత్నించిన అధికారులను మత్స్య సహకార సంఘం నాయకులు అడ్డుకున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రజినికి ఫోన్ చేసి నాణ్యమైన చేపపిల్లలను పంపిణీ చేయాలని కోరారు.
కాంగ్రెస్ హామీ మేరకు వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో దివ్యాంగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.
– మంచిర్యాల టౌన్
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని రజకవాడలోగల బోరు బావి విద్యుత్తు మోటర్‌కు మున్సిపాలిటీ సిబ్బంది తాళం వేయడంపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
– చెన్నూర్