హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తేతెలంగాణ): డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెడతామని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
మంగళవారం నుంచే ఎస్ఏ, ఎస్జీటీ అభ్యర్థులకు 1:3 మెరిట్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. అన్ని ఏర్పాట్లు చేశామని ఘనంగా ప్రకటించారు. కానీ ఫలితాలు విడుదలై 48 గంటలు దాటినా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల విద్యాశాఖ, డీఈవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. షెడ్యూల్ మేరకు సర్టిఫికెట్ల పరిశీలన ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావడంతో మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత 1:3 మెరిట్ ప్రకారం ఎస్జీటీ అభ్యర్థుల జాబితా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బుధవారం ఎస్ఏ మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో పెడతామని వెల్లడించారు.