ఊట్కూర్ : తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పై అచంచల విశ్వాసం నానాటికి పెరుగుతుంది. పదేళ్లపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి( Sankranthi ) పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేసి అభిమానాన్ని చాటుకున్నారు.

తెలంగాణలో మళ్లీ రైతుల జీవితాలు బాగుపడాలంటే సారే రావాలి.. రైతు బంధు కావాలి అంటూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిప్రాస్ పల్లి మాజీ సర్పంచ్ సుమంగళ ఇంటి ఎదుట వేసిన ముగ్గు విశేషంగా ఆకట్టుకుంది. మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున రంగురంగులతో ముగ్గులు వేసి, జై కేసీఆర్.. జై చిట్టెం రామన్న.. అంటూ నినాదాలతో కూడిన ముగ్గులు వేసి నాయకుడు, బీఆర్ఎస్పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.