హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఫేజ్-2 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీ వర్షిణి ఆదివారం ప్రకటనలో వెల్లడించారు.
మిగిలిన క్యాటగిరీలకు చెందిన 13,130 సీట్ల ఫలితాలను ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఫలితాలను www.tgswreis. telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.
గురుకుల డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు
హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సొసైటీ సెక్రటరీ సైదులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు.
రెగ్యులర్ కోర్సులతోపాటు వృత్తివిద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 15లోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. వివరాలకు 040-23328266 నంబర్లో సంప్రదించాలని కార్యదర్శి ఆ ప్రకటనలో వెల్లడించారు.