హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేని తొలి క్యాబినెట్ ఇదేనని మండిపడ్డారు. విద్యావ్యవస్థపై ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల దోపిడీ ఎక్కువైందని, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పలు కాలేజీలకు అనుమతులు లేవని ఆరోపించారు.