మానవాళికి ఏఎంఆర్ ముప్పు
మానవాళికి ‘యాంటీ మైక్రోబియల్ రెసిసెస్టెన్స్' (ఏఎంఆర్) ముప్పు పొంచి ఉన్నదని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) హెచ్చరించింది. అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ను వాడితే వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని వ్యాధికారక సూక్ష్మజీవులు పొందుతాయని తెలిపింది.
- విచ్చలవిడి యాంటీ బయాటిక్స్ హానికరం
- డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మానవాళికి ‘యాంటీ మైక్రోబియల్ రెసిసెస్టెన్స్’ (ఏఎంఆర్) ముప్పు పొంచి ఉన్నదని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) హెచ్చరించింది. అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ను వాడితే వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని వ్యాధికారక సూక్ష్మజీవులు పొందుతాయని తెలిపింది. దీంతో అవి కలిగించే వ్యాధులు యాంటీ బయాటిక్స్కు కూడా లొంగని స్థాయికి చేరుకుంటాయని, వాటినే ‘సూపర్ బగ్స్’గా పిలుస్తారని వివరించింది. ప్రస్తుతం ప్రజారోగ్య రంగం ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యల్లో ఏఎంఆర్ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొన్నది.
ఏఎంఆర్ వల్ల అధిక ముప్పు పొంచి ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉన్నట్టు వెల్లడించింది. ఏఎంఆర్ కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది మరణించినట్టు తెలిపింది. దీన్ని నిలువరించడం కష్టమే అయినా ప్రజలు, ఆరోగ్య సిబ్బంది సహకరిస్తే సాధ్యమేనని డీసీఏ డీజీ కమలాసన్రెడ్డి చెప్పారు. అతిగా యాంటీ బయాటిక్స్ వాడితే పశువులు సైతం ఏఎంఆర్ స్థితికి చేరుకుంటాయని, వాటి ఉత్పత్తులను, మాంసాన్ని తినడం వల్ల మనుషులకు కూడా వ్యాపిస్తుందని తెలిపారు. హాస్పిటళ్లలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెకానిజం సరిగా లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ లోపం వంటివి కూడా ఏఎంఆర్కు కారణమవుతాయని చెప్పారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని, అతిగా యాంటీ బయాటిక్స్ను వాడొద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

