Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో అంతులేని విషాదం అలముకున్నది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. కానీ వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఇంతలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది కాదనే అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. సర్కార్ సమయానికి స్పందించకపోవడం వల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూ ల్ సహా అనేక జిల్లాలు అతలాకుతలం అయ్యా యి.
గతనెల 27న వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, తమకు సకాలంలో సహాయం అంది ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ చేపట్టిన సహాయక చర్యలు, ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతున్నది.
2020, 2022, 2023లో భారీ వర్షాలు రికార్డు సృష్టించాయి. నాడు కేసీఆర్ ప్రగతిభవన్‌ను వార్రూంగా మార్చి, కంట్రోల్ రూంగా చేసి ఎప్పటికప్పుడు భాగస్వామ్య శాఖలను అప్రమత్తం చేశారు. దశాబ్దం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం కురిసింది.
యుద్ధప్రాతిపదికన కడెం ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రా మాలను ముందస్తుగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించటమే కాకుండా కడెం ప్రాజెక్టును వరద ముంపు నుంచి కేసీఆర్ ప్రభుత్వం రక్షించగలిగింది. 2020లో కురిసి న భారీ వర్షాలకు తక్షణం కేంద్రసాయం కింద ఆదుకోవాలని రూ. 1350 కోట్లు ఇవ్వాలని వానలు కురుస్తున్న సమయంలోనే అంచనా లు వేసి నివేదించినా కేంద్రం నుంచి ఒక్కపైసా రాకున్నా రాష్ట్రప్రభుత్వమే ఆదుకున్నది.
భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు సహాయక చర్యలను సైతం రాజకీయ శిబిరాలుగా మార్చుకోవడం దారుణంగా కనిపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశం తీరు, ఖమ్మం బాధితులను పరామర్శిస్తున్న సందర్భంగా సీఎం సహా మంత్రులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపత్కాలంలో కండువాలకు, ఫొటోలకు అంత ప్రాధాన్యం ఎందుకని వరద బాధితులు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి దొంగ దెబ్బతీసినట్టు వానపొటెత్తడంతో భూపాలపల్లి జిల్లా మో రంచపల్లిని వరద నుంచి రక్షించిన వై నం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై 27, 2023లో కురిసిన అతిభారీ వర్షం వల్ల మోరంచపల్లి వాసులు తిరిగి లోకాన్ని చూస్తామ ని కలలో కూడా అనుకోలేదని ఆ ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. మోరంచపల్లి వాగు తెగిపోవడం వల్ల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు.
కేసీఆర్ కేంద్రం రక్షణశాఖతో సకాలంలో సంప్రదింపులు జరిపి ప్రత్యేక హెలికాప్టర్లు, పడవలను తెప్పించి 900మందిని గంటల వ్యవధిలోనే సురక్షిత ప్రాం తాలకు తరలించిన దృశ్యాలు కండ్లముందు తిరుగుతున్నాయి. చరిత్ర లో కనీవినీ ఎరుగని కుంభవృష్టితో ఉ మ్మ డి వరంగల్ అతలాకుతలమైంది. 108 గ్రామాలు ముంపులో చిక్కుకున్న ఉదంతాన్ని జనం గుర్తుచేసుకుంటున్నారు.