ICET | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకే. రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా వివరాలను సాంకేతిక విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది.
కన్వీనర్ కోటాలో ఎంబీఏలో 23,989, ఎంసీఏలో 4,583 సీట్లు ఉన్నాయి. వర్సిటీలవారీగా తీసుకుంటే ఓయూలో 117 కాలేజీల్లో 17,615 ఎంబీఏ, 42 కాలేజీల్లో 3,900 ఎంసీఏ సీట్లున్నాయి. జేఎన్టీయూలో 95 కాలేజీలుంటే 10,125 ఎంబీఏ, 9 కాలేజీల్లో 942 ఎంసీఏ సీట్లున్నాయి.
కాకతీయలో 26 ఎంబీఏ కాలేజీల్లో 2,820, 9 కాలేజీల్లో 900 ఎంసీఏ సీట్లున్నాయి. సోమవారం వరకు 10,634 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 8వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశముండగా, మంగళవారం నుంచి 9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశముంది.