హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘నందినగర్ నివాసం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి పవిత్రమైన గృహంలో సిట్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్‌ను విచారించడంతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది’ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు. అదే నివాసంలో ఉండి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్.. రాజకీయ కక్షతో విచారణల పేరుతో వేధిస్తూ ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని మండిపడ్డారు.
తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకిస్తూ తుపాకీ పట్టుకున్న వ్యక్తే ఈ ప్రభుత్వ పెద్దగా ఉండి వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆలయం లాంటి నందినగర్ నివాసంలో సిట్ పేరుతో కేసీఆర్‌ను విచారించడం బాధాకరమని అన్నారు.