హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా వృత్తి కులాలన్నింటికీ రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రాత్మక నిర్ణయమంటూ బీసీ సంఘాల, కుల సంఘాల నాయకులు ఆనందం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించడంతోపాటు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వృత్తుల వికాసానికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని, కుల సంఘాల నేతలు విశ్వాసం వ్యక్తంచేశారు.
లక్ష ఆర్థిక సాయం గొప్ప విషయం
సీఎం కేసీఆర్ బీసీ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీసీ కులాల్లో వెనకబడిన రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఉచిత విద్యుత్, ఆధునిక ధోబీఘాట్లు, వృత్తి నైపుణ్యాల పెంపుల శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. తాజాగా వృత్తి కులాలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామనడం గొప్ప విషయం.
– రాచమల్ల బాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సామాజిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట
ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల వృత్తుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు నేరుగా కుల వృత్తిదారుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించడం హర్షనీయం. అందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ జాతీయ కన్వీనర్
వృత్తిదారులకు ఎంతో ప్రయోజనం
తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగంతోపాటు, అన్ని కుల వృత్తుల ఆధునికీకరణకు, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నది. ఇప్పుడు వృత్తికులాల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌కు పద్మశాలీలు, చేనేత కార్మికుల తరపున నా ధన్యవాదాలు.
– యర్రమాద వెంకన్న, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు
చేతి వృత్తులకు ఆర్థికసాయం హర్షణీయం
తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తున్న విధానం ఎంతో ఆదర్శనీయం. చేతి వృత్తిదారుల సంక్షేమానికి రూ.లక్ష ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. కుమ్మర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-నడికుడ జయంత్‌రావు, కుమ్మర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
బీసీల పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. బీసీల సంక్షేమానికి ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని వృత్తికులాలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం గొప్ప విషయం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– దుండ్ర కుమారస్వామి, బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
వెనకబడిన తరగతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. సామాజికంగా, ఆర్థికంగా బీసీల ఎదుగుదలకు దోహదపడే పథకాలను అమలు చేస్తున్నది. ఇప్పుడు ఏకంగా వృత్తికులాల ఆర్థికాభ్యున్నతికి ఏకంగా రూ.లక్ష అందివ్వాలడం గొప్ప విషయం.
– రాజేశ్వర్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు
దేశంలోనే చరిత్రాత్మకం
సమాజంలో ఉత్పత్తి కులా లు ఎంతో గొప్పగా సేవలను అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, పాలకుడు కానీ ఉత్పత్తి కులాల శ్రే యస్సును, వృత్తిదారుల సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. తొలిసారిగా సీఎం కేసీఆర్ మొత్తంగా వృత్తి కులాలన్నింటికీ ఆర్థిక సాయమందిస్తామని ప్రకటించడం చరిత్రాత్మకం. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– గోసుల శ్రీనివాస్‌యాదవ్, యాదవ సంఘాల జేఏసీ చైర్మన్
కులవృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం భేష్
ఇప్పటికే మేదరులకు వెదురుతో గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. కొద్ది మందికి రుణాలను కూడా మంజూరు చేసింది. అదేరీతిన మిగతా కులవృత్తుల అభ్యున్నతికి కూడా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నది. ఇప్పుడు ఏకంగా వృత్తికులాల ఆర్థికాభ్యున్నతికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడం హర్షణీయం. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వెంకట్రాముడు, మేదరి సంఘం గౌరవ అధ్యక్షుడు
ఇది బీసీ కులాలకు శుభ పరిణామం
బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. విడతలవారీగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వృత్తికులాల ఆర్థికాభ్యున్నతికి రూ.1లక్ష ఇస్తామనడం చరిత్రాత్మకం. సబ్బండ వర్గాల తరపున సీఎం కేసీఆర్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– అక్కే వీరస్వామి, సర్వాయి పాపన్న మోకుదెబ్బ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు