Professors | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఆచార్యులు లేక కునారిల్లిన వర్సిటీలు.. ఇప్పుడు మరింత సంక్షోభం దిశగా అడుగులేస్తున్నాయి. ఇంత కాలం రెగ్యులర్ ఆచార్యులు ఉద్యోగ విరమణలు పొందగా, తాజా గా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం విరమణలు పొందుతున్నారు. ఇదీ రాష్ట్రంలోని వర్సిటీల పరిస్థితి. 60 ఏండ్ల వయోపరిమితి పూర్తవడంతో పలువురు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందారు. మరికొంత మంది రెడీగా ఉన్నారు. ఇటీవల ఏకంగా 15 మంది వైదొలిగారు. అటు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక, ఇటు కాంట్రాక్ట్ ఆచార్యులు సై తం ఉద్యోగ విరమణ పొందుతుండటంతో వర్సిటీల్లో బోధన గాడి తప్పుతున్నది.
రాష్ట్రంలో 2,888 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులుంటే, 800 వరకు మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. మరో 2,044 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో 900 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. వీరు కూడా ఉద్యోగ విరమణ పొందుతుండటం విశేషం. ఉద్యోగ, వేతన భద్రత లేకపోవడంతో ఆయా కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. వీరిని రెగ్యులరైజ్ చేయాలని చేయాలని ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నేతలు గొంతు చించుకున్నారు. అధికారంలోకి వ చ్చాక ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గతంలో అసెంబీ లో ప్రసంగిస్తూ.. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశా రు. ఇప్పుడు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఇటీవల తమను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ ఆచార్యులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అయినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. తామేమీ అనర్హులం కాదని, పీహెచ్‌డీలు, నెట్, సెట్ కలిగి ఉన్నామని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఫొటోలో ఉన్న డాక్టర్ ఏ అనితాకుమారి నిజాం కళాశాల జువాలజీ డిపార్ట్మెంట్లో 24 ఏండ్లపాటు పనిచేసి 2023 సెప్టెంబర్‌లో 60 ఏండ్లు పూర్తవడంతో రిటైర్మెంట్ అయ్యారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు అందిన వేతనం తప్ప, ఉద్యోగ విరమణ సమయంలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూరకుండానే రిటైర్మెంట్ అయ్యారు.
కాలేజీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 25 ఏండ్లుగా కాంట్రాక్ట్ ఆచార్యుడిగా పనిచేస్తున్న ఇతను 60 ఏండ్లు నిండటంతో ఈ ఏడాది డిసెంబర్లో ఉద్యోగం నుంచి వైదొలగనున్నారు.