టేకులపల్లి/బూర్గంపహాడ్, మే 27 : కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన భార్యతో ఓటు వేయించడానికి బైక్పై వెళ్తుండగా వీరి బైక్ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మం డలం సంపత్నగర్కు చెందిన పాయం కృష్ణ (40), జానకి(36) దంపతులు. ఉద్యోగ రీ త్యా పాల్వంచ వెళ్లిపోయారు. జానకి స్వగ్రా మం టేకులపల్లి కావడంతో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించడానికి సోమవారం పాల్వంచ నుంచి బైక్పై తీసుకొస్తున్నాడు. లక్ష్మీదేవిపల్లి మండలం లాల్తండా సమీపంలోకి రాగానే జనగామ నుంచి భద్రాచలం వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి వీరి బైక్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన దంపతులను స్థానికులు కొత్తగూడెంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వా రు మృతిచెందారు. వీరికి ఒక పాప ఉన్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి దుర్మరణం చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. అశ్వాపురం మండలం పాములపల్లికి చెందిన కుంజా రాజశేఖర్(32) పాల్వంచ లోని ఓ ప్రైవేటుస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బైక్పై పాములపల్లికి వచ్చి అశ్వారావుపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. తిరిగి పాల్వంచకు వెళ్తుండగా మోరంపల్లిబంజర్ సమీపంలోకి రాగానే హైవేపై ఉన్న డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో బైక్పై నుంచి కిందపడిన రాజశేఖర్ తలపై అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ టైరు ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.