హైదరాబాద్ : సీపీఆర్ (CPR )తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను సైబరాబాద్(Cyberabad) సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. శుక్రవారం ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఆరం ఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సీపీఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు అతడిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడు. సకాలంలో వైద్య సహాయం అందడంతో బాధితుడు ప్రాణాలతో బయట పట్టాడు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.
కాగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic Constable) రాజశేఖర్ సమయస్ఫూర్తిని అభినందిస్తూ సైబర్‌బాద్ సీపీ రివార్డును అందజేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు కానిస్టేబుల్‌ను అభినందించారు.
Commendable efforts of Shri Rajasheker, a constable from the Rajendranagar PS,who demonstrated exceptional professionalism and presence of mind in saving a precious life,Upon recognising the critical situation,he promptly administered CPR to the person, leading to their recovery. pic.twitter.com/SCdkZpp0uw
— Cyberabad Police (@cyberabadpolice) February 24, 2023