Kerala Crime Files | క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు శుభవార్త. మలయాళంలో అద్భుతమైన విజయాన్ని అందుకుని, ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ ఇప్పుడు మూడవ సీజన్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను జియో హాట్‌స్టార్ (JioHotstar) తాజాగా పంచుకుంది. ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. మునుపటి సీజన్ల మాదిరిగానే, సీజన్ 3 కూడా కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ సహా మొత్తం ఏడు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ భారీ విడుదల ప్రేక్షకులకు మరపురాని క్రైమ్ థ్రిల్ అనుభూతిని అందించనుంది. సీజన్ 3కి సంబంధించిన మరింత అధికారిక విడుదల తేదీ లేదా టీజర్ సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సిరీస్‌లో ఇన్స్పెక్టర్ మనోజ్ శ్రీధరన్ పాత్రలో అజు వర్గీస్, సబ్-ఇన్స్పెక్టర్ కురియన్ అవరన్ పాత్రలో లాల్ల నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సీజన్ 3లో కూడా నటులు అజు వర్గీస్ మరియు లాల్ తమ పాత్రలను కొనసాగించనున్నారు.