Srikanth Odela Birthday | ‘దసరా’ (Dasara) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నేడు శ్రీకాంత్ పుట్టినరోజు కావడంతో చిత్రబృందం ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. ‘ది ప్యారడైజ్’ చిత్ర నిర్మాణ సంస్థ అయిన SLV సినిమాస్ శ్రీకాంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది.
స్వతహాగా ఇంట్రోవర్ట్ (Introvert), నిశితమైన స్వభావం కలవారు. కానీ సెట్స్‌లో మాత్రం ఎంతో ప్యాషనేట్, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. ఆయనే మన ‘సైలెంట్ మాన్స్టర్’ శ్రీకాంత్ ఓదెలా. మా టీమ్ #TheParadise తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు! అంటూ చిత్రయూనిట్ పోస్ట్ చేసింది. ‘దసరా’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెలా.. ‘ది ప్యారడైజ్’ చిత్రంతో నానిని మరింత మాస్, ఇంటెన్స్ లుక్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ సినిమాను 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.