KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): పదేండ్లలో కేసీఆర్ సర్కారు భారీగా ఉద్యోగాలు సృష్టించిందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే స్పష్టం చేస్తున్నది. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ తోడ్పాటుతో ఐటీ, సేవల రంగంతోపాటు 12 ప్రధాన రంగాలు భారీగా విస్తరించిన విషయాన్ని ఈ నివేదిక కండ్లకు కట్టింది. గడచిన 40 ఏండ్లలో వచ్చి న ఉద్యోగాలతో సమానంగా గత పదేండ్లలో ఉద్యోగాలు లభించాయనే విషయాన్ని తాజా నివేదిక నిర్ధారిస్తున్నది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) పాలసీని బుధవారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో 12 ప్రధాన రంగాల్లో ఎంఎస్ఎంఈలు సాధించిన ప్రగతిని, కల్పిస్తున్న ఉద్యోగాల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం 12 రంగాలకు చెందిన ఎంఎస్ఎంఈల్లో దాదా పు 67 లక్షల మందికి ఉద్యోగాలు లభించా యి. ఇందులో గడిచిన పదేండ్లలోనే దాదాపు 30 లక్షల ఉద్యోగాలు లభించినట్టు వివిధ గ ణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
ముఖ్యంగా ఐటీ, సేవల రంగంలో కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో సుమారు 15 లక్షల ఉద్యోగాలు లభించాయి. ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటీఆ ర్ చేసిన ప్రత్యేక కృషితో పెద్ద ఎత్తున ఐటీ, బ్యాంకింగ్, బీమా సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరాయి. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో ఆహారశుద్ధి రంగం పై దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ సర్కారు, ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటుచేసింది.
కోకాకోలా వంటి అనేక బహుళజాతి సంస్థలు కూడా రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వస్త్ర పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్స్, ఇంజినీరింగ్, ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాలకు ప్రత్యేక పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో కేసీఆర్ ప్రభుత్వం విజయవంతమైంది. దీంతో ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించాయి.