హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ అధికారులకే న్యాయం దక్కని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్నది. సుదీర్ఘ అనుభవం, అర్హతలున్నా ఇతరసాకులు చూపుతూ దళిత అధికారులకు ప్రమోషన్ దక్క కుండా చేస్తూ, ఇతరులను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నారని దళిత సం ఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లి మిటెడ్ ఎండీగా విధులు నిర్వర్తించిన కరుణాకర్ నిరుడు ఉద్యోగ విరమణ పొందారు. నాటి నుంచి ఆ పోస్టు ఖా ళీ ఉన్నది. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ క్షితజ ఇటీవల వరకు ఇన్చార్జి ఎండీగా వ్యవహరించగా, ప్రభుత్వం తాజాగా జితేందర్‌రెడ్డిని నియమించింది. ఇక కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ నిరుడు మేలో ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఆయన స్థానంలో ఇన్చార్జి జీఎంగా డిప్యూటేషన్‌పై హన్మంతునాయక్ను నియమించారు. ఇప్పుడు దీనిపైనే దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్లో జీఎం పోస్టుకు అర్హులైన అధికారులున్నారు. 20 ఏండ్లుగా కార్పొరేషన్ ఈడీగా వ్యవహరిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన అధికారి ప్రమోషన్ జాబితా లో ముందున్నారు. సదరు అధికారిపై ఆరేండ్ల క్రితం విజిలెన్స్ కేసు నమోదైంది. ఎంక్వయిరీ సైతం ముగిసింది. సదరు అధికారి పాత్ర ఏమీ లేదని ని రూపితమైంది. విజిలెన్స్ చార్జ్‌ల ఎత్తివేత ఫైలు కార్పొరేషన్ నుంచి ఉన్నతాధికారులకు చేరి ఏండ్లు గడుస్తున్నది. కానీ, ఆ ఫైల్‌ను అక్కడే తొక్కిపెడుతున్నారని తెలుస్తున్నది.
చార్జ్‌లను ఎత్తివేస్తే సదరు అధికారికి ప్రమోషన్ లభిస్తుందనే కుట్రతోనే పలువురు ఎస్సీశాఖ అధికారులు ఫైల్‌ను పక్కనపెడుతున్నారని దళితసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ అధికారిని పక్కనపెట్టినా, దళిత సామాజిక వర్గానికే చెందిన మహిళ సైతం సీనియర్ జాబితాలో ముందున్నారు. జీఎం పోస్టుకు అర్హతలున్నాయి. కానీ, ఎస్సీ సంక్షేమశా ఖ అధికారులు దృష్టిపెట్టడం లేదు. డీపీసీ(డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమి టీ) ఏర్పాటుచేయకుండా సీనియర్ ఈడీలను, అందులోనూ దళిత అధికారులను కీలక పదవుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని దళితసంఘాలు ఫైర్ అవుతున్నాయి.