కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు 16 వేలే
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎ న్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.
- కేంద్రంలో 60 లక్షలు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎ న్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. 62 వేల పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నదని, వాస్తవానికి ఇచ్చింది 16 వేలేనని పేర్కొన్నారు. మిగతావన్నీ గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, టీ జ్యోతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కేంద్రంలో 60 లక్షలు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. పోలీస్ ఉద్యోగార్థుల డిమాండ్ మేరకు తక్షణమే 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి’ అని డిమాం డ్ చేశారు. నిరుద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న మహాధర్నా నిర్వహించనున్నట్టు జాన్‌వెస్లీ, రంగారెడ్డి వెల్లడించారు. గుడిసెలు వేసుకున్న పేదలకు 120 గజాల చొప్పున స్థలమిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని డిమాం డ్ చేస్తూ 6న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాకు తరలిరావాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

