హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఆమె మంగళవారం ఎక్స్ పోస్టులో విమర్శించారు. గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్‌పై రూ.800 పెంచి తాజాగా కేవలం రూ. 200 మాత్రమే తగ్గించిందని ఆమె పేర్కొన్నారు.