నల్లగొండ, జూలై 16: సీఎం రేవంత్‌రెడ్డి 20నెలల పాలనను గాలికొదిలి కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శిస్తూ కాలం గడపడం బాధాకరమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్ భాస్కర్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్రెడ్డతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తుంగతుర్తిలో రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వ సొమ్ముతో సభ పెట్టి కేసీఆర్‌పై, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై దురుద్దేశంతో రాజకీయ విమర్శలు చేయటం సీఎం రేవంత్ హోదాకు తగదని అన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్ భాస్కర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చొరవతో దామరచర్లలో 34వేల కో ట్లతో పవర్ ప్లాంటు, మూడు మెడికల్ కళాశాలలు, ఐటీహబ్, సాగర్ కింద లిఫ్ట్ లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది జగదీశ్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లించ్చింది బీఆర్ఎస్సేనని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నిరంజన్‌వలి పాల్గొన్నారు.