హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సంచ లనం సృష్టించిన నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంలో సీఐడీ పోలీసులు పురోగతి సాధించారు.
ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేయగా.. తాజాగా మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సోమవారం సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కు చేరుకున్నది.