దేవరకద్ర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్లకు పైగా వెచ్చించి, 27 చెక్‌డ్యాంలు నిర్మించారు. ఎంతవరద వచ్చినా అవి నేటికీ చెక్కుచెదరలేదు. కానీ, అదే నియోజకవర్గంలోని అడ్డాకుల మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం రెండునెలలకే కొట్టుకుపోయింది.
రాచాల-గుడిబండ గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్‌డ్యాం కాంట్రాక్టర్ల అవినీతి, ప్రభుత్వ వైఫల్యంతో ఆనవాళ్లు కూడా లేకుండాకొట్టుకుపోయింది. రూ.4.6 కోట్ల ప్రజాధనం గంగపాలైంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రధాన అనుచరులే సబ్‌కాంట్రాక్టు దక్కించుకొని పనులు పూర్తి చేయడం గమనార్హం. కాంగ్రెస్సా.. మజాకా!!