హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ధాన్యం టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని, తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవారం లేఖ రాసింది. కాంగ్రెస్ నేత జీ నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది.