ధర్మారం, డిసెంబర్ 24: కేంద్రం మొండి వైఖరి వీడి బాయిల్డ్ రైస్ కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీసి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులతో
చెలగాటం ఆడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాల వల్ల రైతులు పంటల సాగులో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. అనంతరం బొట్లవనపర్తి గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్లు, వార్డుసభ్యులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరగా మంత్రి కొప్పుల వారికి
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.