హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): ఈ వానకాలం సీజన్‌కు యూరియా కొరత తప్పదా..? రైతులు మళ్లీ యూరియా కోసం చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిందేనా..? ఇందులో భాగంగానే ఈ సీజన్‌కు యూరియా కొరత తప్పదనే సంకేతాలను స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇస్తున్నారు.
వానకాలం సీజన్‌కు సంబంధించి రాష్ర్టానికి రావాల్సిన యూరియా కోటాలో కేంద్రం కోత పెడుతున్నదని బుధవారం ఆరోపించారు. రాష్ర్టానికి యూరియా కొరతపై కేంద్రానికి ఏప్రి ల్ 19న, మళ్లీ మే 26వ తేదీన లేఖలు రాసినట్టు తెలిపారు. ఇప్పుడు మూడోసారి లేఖ రాయనున్నట్టు తెలిపారు.