హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డి సెంబర్ నుంచి సోమవారం(15వ తేదీ) వరకు రూ.21,881 కోట్లను మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చుచేసింద ని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు రూ.49,618 కోట్లను అప్పుగా తీసుకున్నట్టు పేర్కొన్నది. అప్పులు, వడ్డీ కింద రూ.56,440 కోట్ల ను తిరిగి చెల్లించినట్టు ప్రకటించింది. రూ.54,346 కోట్లను వివిధ పథకాల కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది.