BRS | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ‘కొర్రీలొద్దు…కోతలొద్దు.. ప్రతి రైతురూ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి’, ‘రుణమాఫీలో కోత.. సీఎం మాటలేమో రోత’.. అంటూ గురువారం రాష్ట్రమంతా రైతుల నినాదాలతో మార్మోగింది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు రైతుల నినాదాలతో హోరెత్తాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు సమస్త పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించాయి. కళాకారులు ఆటపాటలతో సర్కార్‌పై గళమెత్తారు. కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొనగా, ఆలేరు, జనగామ నియోజకవర్గాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ధర్నాల్లో రైతులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వా మి ఆలయం సాక్షిగా రేవంత్‌రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం ప్రకటించింది. దేవుళ్ల మీద ఒట్టేసి, మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి ఆలయంలో మాజీ మంత్రి హరీశ్‌రా వు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, బీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, మేడె రాజీవ్‌సాగర్, దూదిమెట్ల బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, మంత్రి శ్రీదేవి, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి సహా ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైతు ధర్నాలో పాల్గొన్న ప్రసంగిస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్న రైతులనుద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రుణమాఫీ ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి దయాకర్‌రావు. చిత్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వాసుదేవరెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి. చిత్రంలో హాజరైన బీఆర్ఎస్ నేతలు, రైతులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ నేతలు, రైతులు
మహబూబాబాద్‌లో జరిగిన ధర్నాలో నినదిస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతుధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్. చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలో రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు, రైతులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు