శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 21:25:04

మా కాలంలో అత్యుత్తమ క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ కొండలరావు: సీఎం కేసీఆర్‌

మా కాలంలో అత్యుత్తమ క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ కొండలరావు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : సీనియర్ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అప్పట్లో కొండల‌రావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండేవారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్ధించారు. 

ఇదిలా ఉండగా కొండ‌లరావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న  సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా న‌టుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo