మహాక్రతువు సక్సెస్ చేసినందుకు అభినందనలు
అధికార యంత్రాం గం సమన్వయంతో భద్రాచలం సీతారాముల కల్యాణం, రామ య్య పట్టాభిషేక మహోత్సవాలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల గురువారం అభినందనలు తెలిపారు.
- భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : అధికార యంత్రాం గం సమన్వయంతో భద్రాచలం సీతారాముల కల్యాణం, రామయ్య పట్టాభిషేక మహోత్సవాలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల గురువారం అభినందనలు తెలిపారు. వేడుకల నిర్వహణకు, అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేసి మన్ననలు పొందారని అన్నారు.
రెండు రోజులపాటు మహాక్రతువు దిగ్విజయంగా జరగడం.. జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలను భక్తులు పాటిస్తూ పూర్తిస్థాయిలో సహకరించారని అన్నారు. మహోత్సవ వేడుకల సమాచారం ఎప్పటికప్పుడు భక్తులకు అందించిన పాత్రికేయులను కలెక్టర్ అభినందించారు. భక్తులు ఎంత మంది వచ్చినా ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూశామన్నారు. దేవాదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్ వేడుకలకు ముందు నుంచే ఏర్పాట్లలో ఉన్నారని, ప్రతి ఉద్యోగి బాధ్యతతో పని చేశారని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

