Tatikonda Rajaiah | వరంగల్ : బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇదే ఘన్పూర్లో నువ్వా.. నేనా చూసుకుందాం అని కడియంకు రాజయ్య సవాల్ విసిరారు.
వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రా ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం అని సవాల్ విసిరారు. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యనే అని స్పష్టం చేశారు. మన ఇద్దరి మధ్య పోరాటం కోసం ఒక్క తెలంగాణనే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోందని రాజయ్య తెలిపారు.
కడియం శ్రీహరికి సవాల్ విసిరిన రాజయ్య!
నీకు సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. రా ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం – మాజీ ఎమ్మెల్యే రాజయ్య pic.twitter.com/Tg5M5Aib2M
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2024