పెద్దవంగర, మే 21: ‘రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చేం లాభం? వంట చేస్తే మెత్తబడుతున్నది’ అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలకేంద్రానికి చెందిన మహిళలు సన్నబియ్యం అన్నంపై చర్చించుకుంటున్న వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
పెద్దవంగరకు చెంది న మహిళలు ఇటీవల రేషన్ షాపులో సన్నబియ్యంతో వంట చేస్తే అన్నం మెత్తగా రబ్బరులాగా మారి తినడానికి ఇబ్బందిగా ఉందని.. ఇలాంటి బియ్యం ఇచ్చి ఏం లాభమని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.