యాదాద్రి భువనగిరి : ‘యాదగిరిగుట్ట శిల్ప కళ అద్భుతం..రాతి కట్టడం అద్వితీయం.. అమోఘం. అబ్బురపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు’ అని మిస్ వరల్డ్ పోటీదారులు పరవశించిపోయారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లిని సుందరీమణులు సందర్శించారు.
యాదగిరిగుట్ట కొండపైన భక్తుల ఘర్షణ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపైన బస్టాండ్ వద్ద గురువారం భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో దర్శనానికి వచ్చిన భక్తులు వెంటనే కొండకిందికి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. బస్సులు లేక బస్టాండ్లో వేచి ఉన్న భక్తులు బస్సును ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా వెనుకనే ఉన్న మరికొంత మంది భక్తులు కొందరిని లాగి కిందికి దింపే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
-యాదగిరిగుట్ట