మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 13: బీసీలకు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెం పు అంశాలను పొందుపర్చిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్ కుమార్ గుర్తుచేశారు. బీసీ గణన చేపట్టి, రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం నాయ కులు ఆకారపు మోహన్, నూతనకంటి ఆనందం, భిక్షపతి, పీ మల్లేశ్ ఉన్నారు.