హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్( Mahabubabad Railway station) శివారులో పడేసి వెళ్లారు. ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సోమవారం శిశువు మృతదేహాన్ని(Baby body) గుర్తించిన రైల్వే పోలీసులు మార్చురీకి తరలించారు. కాగా, శిశువు మృతదేహం ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఇక్కడ పడేశారా? లేదా అక్రమ సంతానమా అనే భిన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్ల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.