మహబూబ్నగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పచ్చని చెట్లపై గొడ్డలి వేటుపడింది. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. అయితే కొల్లాపూర్-పెబ్బేరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న.. కేసీఆర్ ప్రభుత్వంలో నాటిన పదేండ్ల నాటి పచ్చని చెట్లను నరికేశారు.
గ్రామ సమీపంలో నిర్వహించే బహిరంగ సభ కోసం సర్వే నంబర్ 721లోని గుట్టలను సైతం గుల్లచేశారు. బుల్డోజర్లతో ధ్వంసం చేసి మట్టిని కొల్లగొట్టారు. సందట్లో సడేమియా అన్నట్టు దొరికిందే తడవుగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మట్టిని వారి అవసరాలకు తరలించుకుపోయారు. ముఖ్యమంత్రి పర్యటనతో అభివృద్ధి జరుగుతుందనుకుంటే విధ్వం సం జరుగుతున్నదని స్థానికులు చర్చించుకుంటున్నారు.