Farmer Suicide | మరో రైతును బలిగొన్న రైతు ద్రోహి రేవంత్ సర్కారు.. వెక్కివెక్కి ఏడ్చి ఆత్మహత్య చేసుకున్న రైతన్న తుడుం గణపతి.. Video
Farmer Suicide | రాబందు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. రైతుబంధు సరిగా ఇవ్వక, సాగునీరు ఇయ్య చేతగాక, ఎరువులు సరిగా సరఫరా చేయక, పంటకు నష్టపరిహారం ఇయ్యక, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక రైతు ద్రోహి రేవంత్ సర్కారు రైతన్నలను దెబ్బమీద దెబ్బ కొడుతున్నది.
Farmer Suicide : రాబందు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. రైతుబంధు సరిగా ఇవ్వక, సాగునీరు ఇయ్య చేతగాక, ఎరువులు సరిగా సరఫరా చేయక, పంటకు నష్టపరిహారం ఇయ్యక, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక రైతు ద్రోహి రేవంత్ సర్కారు రైతన్నలను దెబ్బమీద దెబ్బ కొడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోక, అకాల వర్షాలతో పంట దిగుబడి సరిగా రాక, పండిన పంటను కొనేవాడు లేక, సాగు భారమైపోయి, అప్పులు కుప్పల్లా పేరుకుపోయి, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రేవంత్ సర్కారు దుర్మార్గపు పాలనవల్ల తాజాగా మరో రైతు బలయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఓ వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కిండు. తాను 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడితే.. సాగునీరు సరిగా లేక, ఎరువులు సమయానికి దొరకక, పంట దిగుబడి తగ్గిందని.. పండిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవాళ్లు లేరని పసిబిడ్డలా వెక్కివెక్కి ఏడ్చిండు. ఈ అమ్ముడుపోని పంటను ఓ లీటర్ పెట్రోల్ తెచ్చి తగులబెట్టి, తాను తగులబడుడే మేలంటూ విలపించిండు.
ఈ పంట అమ్ముడుపోకపోతే పరిస్థితి ఏందని వీడియో తీసిన వ్యక్తి ప్రశ్నిస్తే.. ‘ఏముంది సారూ.. ఇగ ఇంత పురుగుల మందు తాగి సచ్చుడే’ అని దుఃఖంతో వణుకుతున్న గొంతుతో చెప్పాడు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చెప్పినట్టే రైతు తుడుం గణపతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుండు. వీడియోలో గణపతి ఆవేదన చూసిన ఎవరికైనా ఆయన అన్నంత పనిచేశాడని తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఆత్మహత్యకు రెండుమూడు రోజుల ముందు రైతు తుడుం గణపతి ఆవేదనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
రాబందు రేవంత్ పాలనలో పిట్టల్లా రాలుతున్న రైతులు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న..!ఒకవైపు పండిన పంటను కొనుగోలు చేయక..
మరోవైపు రైతుబంధు ఇవ్వక
రైతులకు దెబ్బ మీద దెబ్బ కొడుతున్న రైతు ద్రోహి రేవంత్!అకాల వర్షాలతో పంట దిగుబడి రాక,
కాంగ్రెస్ ప్రభుత్వం… pic.twitter.com/BKtMPqRwVK— BRS Party (@BRSparty) March 21, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

