నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్: దళితుల ఆర్థి క అభ్యున్నతే లక్ష్యంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం అవగాహన సదస్సులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఆయా చోట్ల పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై సూచనలు ఇచ్చారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దళితులు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. దళితబంధు దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శవంతంగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందేవరకు ఈ పథకం దశల వారీగా కొనసాగుతూనే ఉం టుందని వెల్లడించారు.
దళితబంధు డబ్బును సద్వినియోగం చేసుకొని, వచ్చిన లాభాలను అవసరాల కోసం వాడుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠాగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ-షెడ్యూల్డ్ కులాల స హకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జేఎన్యూఎఫ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. అర్హులైన జర్నలిస్టులకు దళితబంధు వర్తింపజేస్తామని ప్రకటించారు.
దళిత రక్షణనిధికి రాష్ట్ర ప్రభు త్వం రూ.3,400 కోట్లు కేటాయించిందని గుర్తు చేశా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభు త్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, గాదరి కిశోర్, కాలె యాదయ్య, దుర్గం చిన్న య్య, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మలేపల్లి లక్ష్మ య్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. వనపర్తి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళితబంధు ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ రాములుతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. 13 మంది లబ్ధిదారులకు దళితబంధు మం జూరు పత్రాలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం రుద్రారంలో 95 కుటుంబాలకు దళితబంధు యూనిట్లను జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి లబ్ధిదారులకు అందించారు.
దళితబంధు చాలా మంచి పథకం
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంస
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చాలా మంచిదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మెచ్చుకొన్నారు. హైదరాబాద్ జిల్లాలోని దళితబంధు లబ్ధిదారుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పథకంలో భాగంగా అందించే రూ.10 లక్షలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేసి, ఆదాయ మార్గాలు పెంచుకోవాలని కోరారు.