హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాష్ట్రంలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సంబంధించి మొదట సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని అడ్వైజరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలోని సేవాభవన్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి బీఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగిన 160వ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అప్పర్ భద్ర ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 21,167.93 కోట్లకు(2024-25 ధరల ప్రకారం) పెంచుతూ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 367 చెరువులను నింపడంతోపాటు వాణి విలాస్సాగర్ జలాశయానికి నీటిని తరలించనున్నారు. సమావేశంలో నీతి ఆయోగ్ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు పాల్గొన్నారు.