హైదరాబాద్ : పోలీసు ఉద్యోగం అంటేనే కత్తిమీద సాములాంటిది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందే తెలియదు కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏదైనా తేడా వస్తే నేరస్తులు పారిపోవడమే కాదు, ఉద్యోగం సైతం ఊడుతుంది. తాజాగా పోలీసుల నిర్లక్ష్యంతో ఓ నిందితుడు కోర్టు నుంచి(Kodada court) పారిపోయిన(Accused escaped) సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..ఓ దొంగతనం కేసులో మామిడి గోపి అనే నిందితుడు జైలు కెళ్లాడు.
కేసు విచారణలో భాగంగా సూర్యాపేట పోలీసులు నిందితుడిని ఖమ్మం జిల్లా జైలు నుంచి కోదాడ కోర్టుకు తీసుకొచ్చారు. ఇంతలో ఏం జరిగిందే తెలియదు కాని, గోపి అనే నిందితుడు తన చేతులకు కున్న బేడీలు తీసుకొని పారిపోయాడు. గమనించిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చి నిందితుడికి కోసం గాలింప చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..