హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో సాగు నీరుకోసం(Irrigation water) రైతులు రోడ్డెక్కుతున్నారు. కండ్లముందే పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్లపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం(Farmers agitation) చేస్తున్నారు. తాజాగా నల్లగొండ(Nallagonda) జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడంలో రైతులు సాగునీరు కోసం ఆందోళన బాటపట్టారు. వరద కాలువ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు.
చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని నినదించారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా, రైతుల రాస్తారోకో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.