Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఆస్క్ నాని (AskNani) పేరిటా అభిమానులతో ముచ్చటించాడు నాని. ఈ చాట్ సెషన్లోనే ‘సరిపోదా శనివారం’ మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలావుంటే ఈ చాట్ సెషన్లో ఒక అభిమాని రిప్లయ్ ఇవ్వమని వింతగా పోస్ట్ పెట్టాడు.
నీకోసం ఫ్యాన్ వార్స్ చేస్తున్న అన్న.. రిప్లయ్ ఇవ్వు కెరీర్ మీదా ఫోకస్ చేస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి నాని రిప్లయ్ ఇస్తూ.. నీ పోస్ట్‌కి రిప్లయ్ ఇచ్చాను. ఇకనైనా కెరీర్ మీదా ఫోకస్ చేసి మాట మీద నిలబడు అంటూ నాని రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
I cha. Ippudu maata meedha nilabadu.#AskNani https://t.co/nTdk5mHVem
— Nani (@NameisNani) August 28, 2024
Also Read..