Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. కడియం శ్రీహరి అసెంబ్లీలో భూకబ్జాలపై మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. అనుచరుడు గోరంత బలరాం ఆధ్వర్యంలో కడియం అంతులేని అవినీతి చేశారని ఆరోపించారు.
బినామీ పేర్లతో సింగపూర్, మలేసియాలో కడియం శ్రీహరి ఆక్రమ ఆస్తులు సంపాదించారని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. కడియం శ్రీహరి అంటే ఖల్ నాయక్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు దొంగలు అని అన్నారు. వాళ్లిద్దరూ కూడా ఒకరిని మరొకరు సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు.