KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తెలంగాణ పల్లె ప్రగతి( Telangana Palle Pragathi ) కార్యక్రమంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులను గెలుచుకుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ అవార్డులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. అది తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం శక్తి అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల కార్యనిర్వహణ యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.
State with less than 3% of the Nation’s population wins 30% of the awards declared by Union Govt
That is the power of #Telangana Palle Pragathi program ✊
Happy #PanchayatiRajDay to all the functionaries of Gram Panchayat Administration on showing rest of India what can be… pic.twitter.com/aYWt3rD1gu
— KTR (@KTRBRS) April 24, 2023