Hyderabad | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి పూట రాచకొండ కమిషనరేట్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. బాలాపూర్ హోటల్స్, క్రికెట్ గ్రౌండ్స్‌లో తనిఖీలు చేపట్టారు.
రాత్రిపూట గేమ్స్, అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించకూడదని నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే హోటల్ యజమానులకు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భద్రతా నియమాలు పాటించాలని, అనవసర ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు