Accident | మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం ఇందారం సమీపంలో ఆగివున్న లారీని వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. కరీంనగర్లో వరినాట్లు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.