ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుపై కేసు నమోదైనట్టు తెలిసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించినందుకు ఆయనపై గురువారం కేసు నమోదు చేసినట్టు సమాచారం.
బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డిలోని పలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లినట్టు ఆరోపణలు రావడంతో ఆయనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది.